శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శుక్రవారం, 29 డిశెంబరు 2017 (21:16 IST)

2018లో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఇలా వున్నాయి...

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదము (తో) అనూరాధ 1, 2, 3, 4 పాదాలు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు (నో, యా, యీ, యు) ఆదాయం- 2, వ్యయం-14, పూజ్యత-5, అవమానం -2 ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మము నందు, ఈ సంవత్

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదము (తో) అనూరాధ 1, 2, 3, 4 పాదాలు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1, 2, 3 పాదాలు (నో, యా, యీ, యు) ఆదాయం- 2, వ్యయం-14, పూజ్యత-5, అవమానం -2 
 
ఈ రాశివారికి అక్టోబర్ 11వ తేదీ వరకు వ్యయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా జన్మము నందు, ఈ సంవత్సరం అంతా ధనస్థానము నందు శని (ఏలినాటి శని) ఈ సంవత్సరం అంతా తృతీయము నందు కేతువు, భాగ్యము నందు రాహువు సంచరిస్తారు. 
 
ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలింపగా ''సహనాన్ని మించిన ఆయుధం లేదు" అన్న వాస్తవాన్ని గుర్తెరిగి ముందుకు సాగండి. ఏలినాటి శని ప్రభావము ధన స్థానంలో ఉన్నందువల్ల ఖర్చులు అధికం కావడం, ఆరోగ్యంలో చికాకులు, ప్రశాంతత లోపం, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. గురు రాహు సంచారం సరిగా లేకపోవడం ద్వారా ప్రతి పనిలోను చాలా జాగ్రత్త వహించాలి. 
 
ఇతరుల వ్యవహారాల్లో కలుగచేసుకోకుండా ఉండటం మంచిది. ఎవరినీ నమ్మి ఏ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టరాదు. మీ సలహా అవతలివారికి మంచి ఫలితాలనిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నూతన విషయాలపై దృష్టి పెట్టడం కంటే.. పాత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటమే ఒక విధంగా మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఆశించినంత అభివృద్ధి ఉండదు. కుజ స్తంభన తృతీయంలో ఉన్న కారణంగా ధనలాభము, ఆరోగ్యసిద్ధి, ఇష్టకార్యసిద్ధి, కుటుంబసౌఖ్యం వంటివి ఉండగలవు. కుటుంబ విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అంటూ ఏమీ వుండవు. సంతానం అభివృద్ధి సంతోషాన్నిస్తుంది. చెడు విషయాల పట్ల ఆకర్షితులయ్యే ఆస్కారం ఉంది. తగు జాగ్రత్త అవసరం. 
 
ఓర్పు, సహనంతో ప్రతి విషయాన్ని నిర్వర్తించవలసి వుంటుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. ప్రతి పనిలోనూ అధిక ధనవ్యయం, అధిక శ్రమ తప్పదు. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మీ వృత్తి ధర్మం నిర్వహిస్తూ.. ఎక్కువ కాలం ఆధ్యాత్మిక చింతనలో గడపటం మంచిది. మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాల్లో అధిక శ్రమ ఎదుర్కొంటారు. దైనందిన కార్యాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, రవాణా రంగాల్లో వారికి కలిసి రాగలదు. ఆరోగ్య విషయాల్లో తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటారు. చాలావరకు మీరు తీసుకునే ముందస్తు జాగ్రత్తలు మిమ్మల్ని రక్షిస్తాయి. కళా, క్రీడా రంగాల్లో వారు తమ ప్రతిభను చాటుకుంటారు. 
 
నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు సరైన పెట్టుబడులు అందకపోవడం, అందిన వ్యాపారంలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. ప్లీడర్లతో, ప్లీడరు గుమాస్తాలతో చికాకులు ఎదుర్కొంటారు. ఆడిటర్లకు, వైద్య రంగాల్లో వారికి శ్రమాధిక్యతతో పాటు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. రైతులు నష్టం లేకుండా వ్యవసాయం సాగిస్తారు. విదేశీయాన యత్నాలు సత్ఫలితాలనిస్తాయి. షేర్ వ్యాపారస్తులకు తగు జాగ్రత్త అవసరం. అధికమొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిదికాదు. విద్యార్థులు ఉత్తీర్ణులయినప్పుటికీ ఆశించినంత ఫలితం రాదు. మొత్తం మీద ఈ సంవత్సరం సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. 
 
*2019 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం విశాఖ నక్షత్రం వారు 16సార్లు, అనూరాధ నక్షత్రం వారు 19సార్లు, జ్యేష్ఠ నక్షత్రం వారు 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి ఎర్రని గులాబీలతో శనిని పూజించినట్లైతే దోషాలు తొలగిపోతాయి. 
 
* ఈ రాశివారు ''సంకల్పసిద్ధి గణపతిని'' అష్టమభుజలక్ష్మీని ఆరాధించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
* విశాఖ నక్షత్రం వారికి ''కనకపుష్యరాగం'' అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్ఠవారికి ''గరుడపచ్చ'' ధరించిన శుభం కలుగుతుంది. 
 
* విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను, అనూరాధ నక్షత్రం వారు ''పొగడ'' మొక్కను, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి మొక్కను నాటిన సర్వదోషాలు తొలగిపోతాయి.