ఆలయానికి వెళ్లేటప్పుడు వట్టి చేతుల్లో వెళ్తున్నారా?
ఆలయానికి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఖరీదైన బట్టలు, ఫ్యాన్సీ నగలకు దూరంగా ఉండాలి. గుడికి వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి పూజించాలి. ఆపై దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి.
అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. అలాగే నూనె, కర్పూరం లేదా పువ్వులు పట్టుకెళ్లవచ్చు. ప్రస్తుతం చాలా దేవాలయాల్లో నెయ్యి దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే, దీపస్తంభం ముందు నిలబడి ప్రధాన విగ్రహాన్ని పూజించాలి.
గుడి చుట్టు ప్రదక్షిణలు చేసి చుట్టుపక్కల దేవతలను పూజించాలి. ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి ప్రార్థనలు చేయడం మంచిది. వినాయకుని ఆలయాన్ని ఒకసారి ప్రదక్షణ చేయడం, శివునికి మూడుసార్లు ప్రదక్షణలు చేయడం.. దేవతలకు 3సార్లు ప్రదక్షణలు, విష్ణువు, దేవి ఆలయాలకు వెళ్తే నాలుగు సార్లు ప్రదక్షణలు చేయడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.