సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 13 జులై 2019 (22:35 IST)

14-07-2019 నుంచి 20-07-2019 వరకు మీ రాశి ఫలితాలు..

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
అన్ని రంగాల వారికి ఆశాజనకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు భారమనిపించవవు. ధనప్రాప్తి, వాహన యోగం పొందుతారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. స్ధిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.  
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆదివారం నాడు ప్రముఖల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచింపవద్దు. విశ్రాంతి అవసరం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులకు అనుకూలం. దైవకార్యంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు.  
మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. కష్టమనుకున్నపనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సోమ, మంగళవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సంస్థల స్థాపనకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు కొత్త సమస్మలెదురవుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష   
ఆధిపత్యం ప్రదర్శించవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు బంధువులు వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. గృహమార్పు అనివార్యం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వారం అనుకూలదాయకమే. కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు పదోన్నతి, స్ధానచలనం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.
 
కన్య : ఉత్తర 2, 3 4 పాదాలు. హస్త, చిత్త 1, 2 పాదాలు.  
ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులకు సమయం కాదు. బుధవారం నాడు పనులు సాగవు. మీ పై శకునాల ప్రభావం అధికం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. ఏజెన్సీలు, టెండర్లు దక్కించుకుంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లభిస్తాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖథ 1, 2 3 పాదాలు.  
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహంలో స్తబ్ధత తొలగిపోతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా మెలగాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు హోదా మార్పు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వృత్తుల వారికి సామాన్యం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలు నిలకడగా వుండవు. గత తప్పిదాలు సరిదిద్దుకోవటానికి యత్నించండి. ఖర్చులు అంచనాలకు భిన్నంగా వుంటాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శనివారం నాడు కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం వుంది. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
ఆదాయం బాగున్నా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. గృహమార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరపం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మంగళ, బుధవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. పనులు ముందుకు సాగవు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఎదుటివారి తీరును గమనించి మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
 
కుంభం: ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు  
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. సమర్థతను చాటుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభిస్తాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో ప్రముఖుల సందర్శనం సాధ్యం కాదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. సంతానం దూకుడును అదుపు చేయండి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. సంస్థల స్థాపనలకు అనుకూలం. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. తొందరపడి హామీలివ్వవద్దు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. రవాణా రంగాల వారికి ఆశాజనకం. సంతానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.