ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
తాళ్లపాక అన్నమాచార్య కీర్తనలు ఎంత విన్నా తనివితీరనవి. సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుడే ఆయన కీర్తనలకు మురిసిపోయారని పురాణాలు చెపుతున్నాయి. గోవిందుడి అభయ హస్తం గురించి అన్నమయ్య రచించిన పదకవిత చూడండి.
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోల్ల వాడిచేయి
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి