గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: ఆదివారం, 11 నవంబరు 2018 (22:24 IST)

బెడ్రూం దృశ్యాలను ఫోనులో షూట్ చేశా... ఇప్పుడు ఆ భయం పట్టుకుంది...

నా భార్యతో నేను ఎంతో సంతోషంగా సంసారం చేసుకుంటున్నాను. ఈమధ్య నేను టూర్ మీద వారం రోజుల పాటు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అందుకని నేను నా భార్యతో పాల్గొన్న శృంగారం తాలూకు దృశ్యాలను నా స్మార్ట్ ఫోనులో షూట్ చేసుకున్నాను. అవి షూట్ అయితే చేశాను కానీ నాకిప్పుడు ఓ భయం పట్టుకుంది. అవి పొరపాటును నెట్ ప్రపంచంలోకి లీక్ అవుతాయేమోనని... అలా అయ్యే అవకాశం ఉందా....?
 
సైబర్ ప్రపంచంలో ప్రతిరోజూ వేలకొద్దీ వైరస్ ప్రోగ్రాములు వస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి సహజంగా ఇంటర్నెట్ సౌకర్యం తప్పకుండా ఉంటుంది. వాళ్లు నెట్ యూజ్ చేస్తారు. అలా చేసేటపుడు ఏదైనా ఫోటోను డౌన్లోడ్ చేసినట్లయితే దానితోపాటు వైరస్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు ఆ వైరస్ స్మార్ట్ ఫోనులో ఉన్న డేటా మీకు తెలియకుండానే ప్రోగ్రామర్‌కు వెళ్లిపోతుంది. 
 
ఇది చాలా సమస్యాత్మకం. ఇలా స్మార్ట్ ఫోనులో ఫోటోలు ఉంటే... పొరబాటున అది మిస్ అయ్యిందంటే ఇక ఆ పరిణామాన్ని ఊహించడం కష్టం. కాబట్టి ఇలాంటి చర్యల వల్ల సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతాయి. కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించడం మంచిది.