ఒంటరిని అనే భావన ఎందుకు కలుగుతుంది?

depression
సిహెచ్| Last Modified మంగళవారం, 25 డిశెంబరు 2018 (20:41 IST)
మన జీవితకాలంలో ఏదో ఒకసారి ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు గురవుతుంటాము. చుట్టూ వందలాది జనం ఉన్నా కూడా ఒంటరిని అన్న భావన మనలో కలుగుతుంది. అలా అనిపించుటకు కారణాలేంటో, అవి ఎలా తగ్గించుకోవాలో
తెలుసుకుందాం.

1. శక్తి మరియు సామర్థ్యం తెలియక పోవటం వలన విశ్వాసం కోల్పోతారు. ఇతరులతో పోలుస్తూ స్వతహాగా తక్కువ అంచనా వేసుకోవటం వలన ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది. దీని వలన కుటుంబం మరియు స్నేహితులు మద్దతు తెలిపినా ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది.

2. అధికంగా ఆశించటం వలన కూడా మనం బాధపడాల్సి వస్తుంది మరియు ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు కూడా లోనవుతాము. సామర్థ్యానికి మించిన ప్రతిఫలం ఆశించి ఎక్కువగా ప్రయత్నించటం వలన ఎక్కడికో చేరుకుంటారు, ఫలితంగా వెళ్ళే దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.

3. అహంకారం అనేది మంచి విషయమే కానీ, సొంత నిర్ణయాల పట్ల అహంకారంగా వ్యవహరించటం లేదా ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి అహంకారంగా వ్యవహరించటం మంచిది కాదు. చుట్టూ ఉండే వారు ఇలాంటి వారికి దూరంగా ఉండటం లేదా వారితో మాట్లాడకపోవటం వంటి చేయవచ్చు. చివరకి, మీతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు మరియు ఉండలేరు.

4. మన ఆత్మీయుల ఉండే సంబంధం చివరి రోజుకు చేరుకోగానే మనందరికీ బాధగానే ఉంటుంది. విడిపోయిన బంధం వలన మన మనసు ఒంటరి అన్న భావనకు గురవుతుంది మరియు ఈ స్థితి కోలుకోటానికి సమయం పడుతుంది. కుటుంబ కారణాల వలన లేదా నమ్మక ద్రోహం వంటి కారణాల ఫలితంగా ఒక స్నేహితుడిని కోల్పోవటం లేదా అతడు లేదా ఆమెతో ఉన్న బంధాన్ని కోల్పోవటం వలన చుట్టూ ఎంతమంది ఉన్నా మనం ఒంటరి అనే భావన వెంటాడుతూనే ఉంటుంది.

5. ఈ సమస్య నుండి బయటపడాలంటే.... ముందు అందరితో స్నేహపూర్వకంగా మెలగాలి. ఆధ్యాత్మికత గ్రంధాలను ఎక్కువగా చదవాలి. చదివిన వాటిని ఎల్లప్పుడు మననం చేయడం, భక్తి, సామాజిక సేవా కార్యాక్రమాలల్లో స్వతహాగా పాల్గొనడం, రోజులో ఒక గంట అయినా ధ్యానం, యోగా లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతతను పొందగలరు. ఇలా చేయడం వల్ల ఒంటరితనం అనే భావనను తొలగించుకోవచ్చు.దీనిపై మరింత చదవండి :