1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 12 జూన్ 2024 (19:38 IST)

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

peepal tree
రావిచెట్టు. ఈ చెట్టును దేవతా వృక్షం అని కూడా పిలుస్తుంటారు. ఈ రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపమని అంటారు. త్రిమూర్తి స్వరూపంగా కూడా భావించి పూజిస్తుంటారు. అందుకే రావిచెట్టును చూడగానే సహజంగానే పవిత్రమైన భావన కలుగుతుంది. దేవతా వృక్షం కనుక ఇది ఆలయ ప్రాంగణంలో తప్పక దర్శనమిస్తూ వుంటుంది. రావిచెట్టు అనునిత్యం ఆరాధించవలసిన వృక్షమని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే దేవాలయ ప్రాంగణంలో గల రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. 
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించడం వలన, ఆ కోరికలు తప్పక నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని అంటారు. అలాంటి రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు అంటున్నారు. ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకవచ్చునని పండితులు సలహా ఇస్తున్నారు.