శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 3 జూన్ 2021 (23:14 IST)

శ్రీమహాలక్ష్మికి 9 శుక్రవారాలు అలా చేస్తే కష్టాలు తీరి కోరిన కోర్కెలు...

శుక్రవారం రోజు అమ్మవారికి ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది. అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము.
 
ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపు రంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇప్పించాలి.
 
ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో చేసిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలి. ఇలా తొమ్మిది శుక్రవారాలు చేయడం వలన కష్టాలు తీరి అనుకున్న పనులు విజయవంతమై పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గువేసి, ఇంటి గుమ్మాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తే లక్ష్మీదేవి మన ఇంటిలోనే ఉండి మనకు సకల శుభాలను చేకూరుస్తుంది.