ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (23:19 IST)

గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే...

గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ 33 కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. పచ్చగడ్డి తినిపిస్తే పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. పూజ చేస్తే పరదేవతకు పూజ చేసినట్లు. గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే పరదేవతకు స్వయంగా అలంకరణ చేసినట్లే.
 
గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. మంచి సంతానం కలుగుతుంది. సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది.