మరి ఇంకెందుకు 'నేనూ' 'నాదీ' అనే అహంకారం?
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో విషయాలు వివరించారు. నాది అనేది ఏదీ ఈ చరాచర జగత్తులో లేదని స్పష్టం చేసాడు. మానవుడికి సంబంధించిన విషయాలను ఆ పరమాత్మ ఇలా చెప్పారు.
మనిషి పుట్టుకను ఇతరులు ఇచ్చిందే. పేరు ఇతరులు పెట్టేదే. చదువు ఇతరులు చెప్పేదే. సంపాదన ఇతరులు ఇచ్చినదే. గౌరవం కూడా ఇతరులు ఇస్తారు. పుట్టినప్పుడు మొదటి స్నానం చేయించేదీ ఇతరులే.
చనిపోయినప్పుడు చేయించే ఆఖరు స్నానం కూడా ఇతరులే చేయిస్తారు. అంత్యక్రియలు వేరెవరో చేస్తారు. మరణానంతరం ఆ వ్యక్తి వస్తువులు, ఆస్తి అంతా ఇతరులే తీసుకుంటారు. మరి నేను, నాదీ అనే అహంకారం ఎందుకు?