ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 నవంబరు 2021 (23:14 IST)

కార్తీక మాసం చివరి సోమవారం... కార్తీక పుణ్యస్నానం చేస్తే...

పరమేశ్వరుని ఆరాధనకు తెల్లవారు జామున స్నానం చేయాల్సిందే. లేకుంటే పూజా మందిరంలో ప్రవేశించకూడదని పెద్దలు, పండితులు చెబుతారు. ప్రతి రోజూ నియమానుసారం స్నానం చేస్తే.. ఆయుష్షు పెరుగుతుందనేది నమ్మకం. మన చెంతనే ఉన్న నదీలో కార్తీక స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.

 
ఇక కార్తీక సముద్ర స్నానాలు చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి. కార్తీకమాసంలో చంద్రకిరణాల రూపంలో అమ్మవారు నీటిని అమృతధారగా మార్చి ఆశీర్వదిస్తుందనేది అందరి నమ్మకం. నదిలో మూడుసార్లు మునిగితే..శరీరమంతా చంద్రకిరణ అమృత స్పర్శతో తేజోవంతమవుతుంది. ఔషధ శక్తి వచ్చి..అనారోగ్యం కలగదని పెద్దలంటారు. కార్తీక మాసంలో నదీ స్నానానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. చిత్తశుద్ధిలేని శివపూజలేలరా..అన్నట్టు మనం చేసేదైమైనా చాలా మనసులగ్నం పెట్టి చేసి తీరాల్సిందే.

 
నదీ స్నానం సందర్భంగా ఒంటిపై వస్త్రం ఉంచుకుని...ఒక సత్సంకల్పంతో స్నానమాచరిస్తే తగిన కార్తీక పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. అది మానవులకు రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా నదీ స్నానంతోనే పుణ్య కార్యం అయిపోయిందనుకోకూడదు. తోచనంతగా ధానధర్మాలు చేస్తేనే తగిన పుణ్యం వస్తుంది. అందుకే కార్తీకస్నానాలతోపాటు భక్తజనమంతా శివపూజలు, అభిషేకాలు, ధానధర్మాలు చేస్తే.. భక్తిఫలం దక్కుతుంది. సర్వజయం సిద్ధిస్తుంది.