శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: ఆదివారం, 19 జులై 2020 (22:15 IST)

దేవునికి హారతి ఎందుకు ఇస్తారు?

ఇంట్లో, పూజాగది, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ…. పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు.
 
అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరుతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి.
 
ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో, అలాగే మనం తెలిసీతెలయక చేసిన పాపాలు సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే పరమార్థం అంటారు.