బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (22:32 IST)

తులసి విశిష్టిత ఏమిటి?

మహిళలు శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటూ రోజూ తులసి మొక్కకు నీళ్ళుపోస్తారు సంధ్యాసమయంలో అక్కడ దీపం వెలిగించి కుంకుమ, పుష్పాలతో తులసిని అర్చిస్తారు. తులసిదళాలు, పుష్పాలు లేనిదే శ్రీ మహావిష్ణువుకు, శ్రీకృష్ణ భగవానునికి అర్చన పరిసమాప్తి కాదని పురోహితులు అంటున్నారు. 
 
ఇతిహాసాల ప్రకారం తులసి కృష్ణుల వివాహం హిందూ సంప్రదాయంలో ప్రధానమైంది. తులసి వివాహ పర్వంగా దీనిని జరుపుతారు. ఆధునిక కాలంలో కూడా అన్ని ప్రాంతాలకు ఈ గాథ వర్తిస్తుంది. తులసి పత్రాలు ప్రతి పండుగనాడు, ప్రతి పవిత్ర సందర్భాలలోనూ వినియోగిస్తారు.
 
తులసిలో ఔషధ గుణాలు వున్నందున ఆ ఆకుల కషాయాన్ని జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బందులను తొలగించేందుకు వినియోగిస్తారు. పర్వదినాలలో దేవతలకు చేసే నివేదనలలోను, కొన్ని ప్రత్యేక విందులలోనూ అతిథులకు ఆహారపదార్థాలపై తులసి ఆకును వుంచి అందించడం సంప్రదాయం. 
 
పర్వదినాన చేసే భోజనంపైన, ప్రసాదంపైన తులసి పత్రం ఉంచడం ప్రేమకు, విధేయతకు చిహ్నం. ఆహారశుద్ధికి, విశ్వ చైతన్య శక్తికి ఆ పదార్థాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తున్నామనేందుకు చిహ్నం తులసిపత్రం. తీర్థంలో కూడ తులసిని విధిగా చేస్తారు. తులసి పత్రం త్యాగగుణానికి గుర్తు. పదార్థంపై తులసి ఆకు వుంచాక ఇచ్చేవానికి దానిపై ఎలాంటి హక్కు వుండదు. అందుకే వివాహ సమయాల్లో వధువు తల్లిదండ్రులు ఒక తులసి పత్రాన్ని లేదా బంగారంతో చేసిన తులసి పత్రాన్ని సమర్పిస్తుంటారు.