శ్రావణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, కార్తీక లేదా మార్గశీర్ష మాసాలలోని మొదటి సోమవారం నాడు లేదా మీకు అనుకూలమైన సోమవారం రోజున ఉపవాసం ప్రారంభించి, తదుపరి 16 సోమవారాలు కూడా కొనసాగించడం ఉత్తమం. వరుసగా 16 సోమవారాలు భక్తితో, సర్వశక్తిమంతుడైన మహాదేవుని పట్ల పూర్తి విశ్వాసంతో ఉపవాసం ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. మధ్యలో నిర్లక్ష్యంగా దానిని వదులుకోకూడదు.
సోమవారం వ్రతం చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. శివునిని పూజించాలి. స్నానం చేసే నీటిలో నల్లటి నువ్వులు కలపాలి. ఇంట్లో గంగా జలాన్ని చల్లుకోండి.
పూజ చేయడం:
ఇంట్లో పూజ చేయడానికి, పూజ గదిని పూలతో శుభ్రం చేసి అలంకరించండి.
ఆవు నెయ్యి మరియు అగరుబత్తితో దీపం వెలిగించండి.
శివుని విగ్రహాన్ని లేదా శివలింగాన్ని ప్రతిష్టించి, ముందుగా గణేశుడిని ప్రార్థించండి.
శివలింగానికి అభిషేకంతో పూజను ప్రారంభించండి.
గంగా జలంతో కలిపిన నీటిని సమర్పించండి, తరువాత పాలు, తేనె, చక్కెర, నెయ్యి, పెరుగు కలిపి తయారుచేసిన పంచామృతాన్ని సమర్పించండి. ఇలా శివలింగానికి అభిషేకాదులు పూర్తి చేసి.. తెల్లటి పువ్వులు, బిల్వ ఆకులు, పండు, బియ్యం సమర్పించండి.
సంకల్పం తర్వాత, సోమవారం వ్రత కథను భక్తితో చదవాలి. సోమవారం సాయంత్రం పూజ ముగించడానికి, నెయ్యి దీపం ఉపయోగించి ఆరతి చేసి, శివలింగానికి, చంద్రునికి పువ్వులు నీటిని సమర్పించండి. చంద్రుని దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.
వ్రత ఆహారం: చాలా మంది భక్తులు రోజంతా నీరు మాత్రమే తాగడానికి ఇష్టపడతారు. మరికొందరు పూజ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి భోజనం చేయడానికి ఇష్టపడతారు. అలా కాకుంటే రోజంతా పండ్లు, పాలు, పెరుగు లేదా మజ్జిగ లేదా సాబుదానతో చేసిన వంటకం తినవచ్చు.
పగటిపూట జపించాల్సిన మంత్రాలు: ప్రతి సోమవారం పూజ సమయంలో సోల సోమవార కథ (కథ) చదవడం తప్పనిసరి. ఆ తర్వాత పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయతో శివుడిని స్తుతించవచ్చు. ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించడం వల్ల ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది.
సోమవారం రోజున శివ గాయత్రి మంత్రం.. "ఓం తత్ పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహే, తన్నో రుద్ర ప్రచోదయాత్." అనే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల అన్ని రకాల భయాలు తొలగిపోయి ఆందోళన దూరం అవుతుంది.
రుద్ర మంత్రం.. "
ఓం నమో భగవతే రుద్రాయ."
ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఆ కరుణామయుడైన భగవంతుని ఆశీస్సులు పొందడానికి పఠిస్తారు. ఈ మంత్రంతో కోరిన కోరికలు నెరవేరుతాయి.
ఇంకా మహామృత్యుంజయ మంత్రం
- "ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుస్తివర్ధనం,
ఉర్వారుక్మివ్బంధనాన్ మృత్యోర్ముక్షే మామృతాత్."
ఈ శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల భక్తులు అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందుతాడని, ఆరోగ్యం, సంపద, శక్తిని అందుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
శివ పురాణం ప్రకారం, సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల కెరీర్, వ్యాపారంలో విజయం సాధించవచ్చు. మనశ్శాంతి, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కూడా వస్తుంది. వైవాహిక సంబంధంలో కష్టకాలం ఎదుర్కొంటున్న దంపతులు సోమవార వ్రతం ఆచరిస్తే.. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.