రామేశ్వరంలో పతంజలి జీవ సమాధికి వెళ్తే...? మూలా నక్షత్ర జాతకులు?
రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. భారతదేశంలోని పరమ పవిత్రమైన దేవాలయాల్లో ముఖ్యమైనదిగా ప్రసిద్ధిచెందినది.
ఇక్కడ ప్రతి అణువు శ్రీ రాముని పాద స్పర్శతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని రాములవారి ప్రాంతంగా చెబుతారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వస్థలం కూడా ఇదే. రామేశ్వర జ్యోతిర్లింగం ఏడవ జ్యోతిర్లింగం. రావణాసురుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్యా పాతకం నిర్మించుకోడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడి పంబన్ బ్రిడ్జి మనదేశంలోనే మొట్టమొదటి సముద్ర వంతెనగా ప్రసిద్ధి.
ఇక రామేశ్వరంలో చూడదగిన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు బోలెడున్నాయి. అయితే చాలామందికి రామేశ్వరంలో పతంజలి జీవ సమాధి వుందనే విషయం తెలియదు. సిద్ధపురుషులు 18 మందిలో పతంజలి ఒకరు. ఈయన యోగ గురువు. నందీశ్వరుడి వద్ద యోగాతో పాటు ఇతరత్రా విద్యలను అభ్యసించారు. అష్టాంగ యోగాలకు ఈయనే రచయిత. నందీశ్వరుడి శిష్యులలో పతంజలి ఒకరు. ఈ పతంజలి రుషికి చెందిన జీవ సమాధి రామేశ్వరంలో వుంది. ఈ జీవ సమాధిని సందర్శించిన వారికి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.
ఈయనకు కొబ్బరి నీరు, కరక్కాయ నీటితో పాటు తేనెను కలిపిన తీర్థం, అరటి పండ్లు, ఆవుపాలు అందించే వారికి ఈతిబాధలు వుండవు. పతంజలిని పూజించడం ద్వారా జాతకంలో గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి.
కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. సంపద పెరుగుతుంది. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. సంతాన ప్రాప్తి, ఉద్యోగ అవకాశాలు, విద్యా రంగంలో రాణించడం వంటి శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. అన్నీ రంగాల్లో రాణించడం ద్వారా విజయం వెన్నంటి వుంటుంది.
అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. పతంజలి జీవ సమాధిని సందర్శించేందుకు లేదా పతంజలిని ధ్యానించేందుకు గురువారం శ్రేష్ఠమైన రోజు. ఇంకా మూల నక్షత్రంలో జన్మించిన జాతకులు ఈయనను పూజించడం విశేష ఫలితాలను అందిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.