కరోనా ఎఫెక్ట్.. మంత్రాలయంలో దర్శనాలు రద్దు
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్తే.. మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్‌డౌన్, మినీ లాక్‌డౌన్, నైట్ కర్ప్యూ.. ఇలా పేరు ఏదైనా.. కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.
ఇక, కోవిడ్ సేకవండ్ వేవ్ నేపథ్యంలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కీలక నిర్ణయం తీసుకుంది..
మే 1వ తేదీ నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు..
భక్తులు ఎవరూ దర్శనానికి రాకూడదని మఠం అధికారులు కోరారు.. అయితే, ఈ సమయంలో.. రాఘవేంద్ర స్వామికి ఏకాంతగా పూజలు కొనసాగుతాయని ప్రకటించారు..
కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. తిరిగి భక్తులను దర్శనాలకు ఎప్పటి నుంచి అనుమతించే విషయంపై తర్వాత తెలియజేస్తామంటున్నారు.