శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)

తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.