సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By మోహన్
Last Modified: గురువారం, 24 జనవరి 2019 (16:52 IST)

అమృతకు అబ్బాయి పుట్టాడు...

గతేడాది మిర్యాలగూడలో అమృత-ప్రణయ్‌ల ప్రేమ వ్యవహారంలో అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించడం, ఆ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది. అంతే కాకుండా పరువు హత్యల్లో అలా జరగడాన్ని అందరూ ఖండించారు. అయితే తాజాగా మళ్లీ అమృత వార్తల్లో నిలిచారు. అదేమిటంటే అమృతకు మగబిడ్డ పుట్టాడు. 
 
ప్రణయ్ హత్యకు గురయ్యే నాటికి ఆమె గర్భంగా ఉంది, తన భర్తను చంపినప్పటికీ పుట్టబోయే బిడ్డకోసం బతుకుతానని, అతనిలో ప్రణయ్‌ని చూసుకుంటానని ఆమె చెప్పింది. ఇప్పుడు మగబిడ్డ పుట్టడంతో మళ్లీ ప్రణయ్ తమ ఇంట పుట్టాడని కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.