హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షం
హైదరాబాద్ నగరాన్ని మరోమారు భారీ వర్షం ముంచెత్తింది. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు గత రికార్డులను తిరగరాసింది. అలాగే, ఆగస్టు నెల ప్రారంభంలోనే మళ్లీ జోరు వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం నుంచి పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ వర్షాలు బుధవారం కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షి భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్ ప్రాంతం వరకు విస్తరించిన తెలిపారు. అంతేకాకుండా, తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ రేపు, వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.