ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (13:07 IST)

విజయారెడ్డి డ్రైవర్ మృతి.. ఆయన భార్య నిండు గర్భిణి.. ఓదార్చడం..

విజయారెడ్డి డ్రైవర్ మృతదేహంసొంతగ్రామానికి చేరుకుంది. సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చేరుకుంది. గురునాధం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో 60శాతం కాలిన గాయాలతో అపోలో హాస్పిటల్లో గురునాధం చేరిన విషయం తెలిసిందే. 
 
అయితే అపోలో చికిత్స పొందుతూ గురునాధం మృతి చెందాడు. గురునాథంకు ఒక బాబు ప్రస్తుతం అతని భార్య నిండు గర్భిణీ. దీంతో ఆ కుటంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గురునాథం భార్యను ఓదార్చడం చాలా కష్టతరంగా మారింది.