శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (13:13 IST)

ఇలియానా ప్రేమ అనే పిచ్చి లోకంలో వుందట... ఈ ఫోటో చూస్తే?

టాలీవుడ్‌కు దేవదాసు చిత్రంతో అరంగేట్రం చేసి.. ఆపై స్టార్ హీరోలతో నటించిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. బాలీవుడ్‌లో నాలుగైదు సినిమాలు చేసిన ఈ సన్నపిల్ల ప్రస్తుతం విదేశీ బాయ్‌ఫ్రెండ్‌త

టాలీవుడ్‌కు దేవదాసు చిత్రంతో అరంగేట్రం చేసి.. ఆపై స్టార్ హీరోలతో నటించిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. బాలీవుడ్‌లో నాలుగైదు సినిమాలు చేసిన ఈ సన్నపిల్ల ప్రస్తుతం విదేశీ బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. తన అందచందాలను ఆమె బాయ్‌ఫ్రెండ్ తీసిన ఫోటీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అతనితో సన్నిహితంగా వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ నీబోన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ.. సహజీవనం చేస్తూ వస్తున్న ఇలియానా.. తాను ప్రేమ అనే పిచ్చిలోకంలో ఉన్నానంటూ నిబోన్‌తో ముద్దెట్టుకుంటున్న ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తన బాయ్‌ఫ్రెండ్ సాధారణమైన వ్యక్తి అని చెప్పింది. అతనిని రకరకాల వార్తలతో ఇబ్బంది పెట్టవద్దని కోరింది. నీబోన్ మాటలు పడటం తనకు ఇష్టం వుండదని.. ఇండస్ట్రీలో ఎంత ప్రేముందో అంతే ద్వేషం కూడా వుందని ఇలియానా చెప్పుకొచ్చింది.