గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (12:34 IST)

ప్రియాంకా అరుళ్ మోహన్ లక్కీ ఛాన్స్.. ప్రిన్స్ సరసన రొమాన్స్

Priyanka Arul Mohan
చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ -మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
 
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అంతేకాదు.. మహేష్‌తో ఆమెకు రొమాన్స్ సీన్స్ ఉండనున్నాయట.
 
ఈ సినిమా 'అతడు' సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. పార్థు, అర్జునుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.