త్రిశంకు స్వర్గంలో దర్శకుడు తేజ
దర్శకుడు తేజ కొత్తవారిని పరిచయం చేస్తానని మొదట్లో స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు. తీరా సెట్‌పైకి వచ్చేసరికి డబ్బున్న వారి కొడుకులను హీరోగా చేసేవాడు. వారితోనే పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేసుకునేవాడు. ఇది తెలుగు సినిమా రంగానికి తెలిసిందే. ఉదయ్‌కిరణ్‌ను హీరోగా పరిచయం చేశాక. రిక్షా తొక్కేవాడి కొడుకును కూడా హీరో చేస్తానన్న తేజ మాటలు నమ్మి చాలామంది దెబ్బతిన్నారు కూడా. ఇప్పుడు ఆయన పరిస్థితికూడా అలానే వుంది. ఆయన దర్శకత్వంలో డి. సురేష్‌బాబు రెండో కుమారుడు అభిరామ్‌ను హీరోగా చేయాలని మూడేళ్ళనాటి ప్లాన్.
అలాంటి తేజకు జలక్ తగిలింది. సురేష్‌బాబు మనసు మార్చుకున్నాడో మరోదేమైనా జరిగిందో కానీ అభిరామ్ తొలి సినిమాను అల్లరి రవిబాబు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు కథంతా సిద్ధమైంది. ఎలాగూ రవిబాబు సినిమా చేస్తే ఖర్చు తక్కవు. లొకేషన్లు పరిమితం. యూల్ ఫుల్ కథతో ఇప్పటి ట్రెండ్‌కు తగ్గినట్లుగా చేస్తాడని టాక్ వుంది. కానీ తేజ అయితే ఇప్పటి ట్రెండ్‌కు అందుకున్నాడో లేదో తెలీదు. ఆయన సినిమాలు పెద్దగా విజయాలు ఈమధ్యలో లేవు.
అందుకే ఎన్.టి.ఆర్. బావమరిది నార్నే వంశీయుడిని హీరో చేయాలని అనుకున్నాడు. కానీ అది కూడా సెట్ కాలేదని తెలిసింది. ఇక తప్పేదిలేక తన కొడుకునే హీరోగా చేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలో వున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అంత పెట్టుబడి పెట్టాలంటే మరో చేయి కావాలి. అందుకే నిర్మాత కోసం వెతుకుతున్నాడట. లేదంటే కొత్త విలన్‌ను పరిచయం చేసే క్రమంలో అతన్నుంచి ఏదైనా రాబట్టే ఆలోచనలో వున్నట్లు ఫిలింనగర్ కథనాలు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.