శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (13:09 IST)

`గ‌ని`లో అల్లు అర్జున్ స‌ర్‌ప్రైజ్‌గెస్ట్ రోల్‌!

Allu boby-Arjun
అల్లు అర్జున్ `పుష్ప‌` సినిమాలో బిజీగా వున్నాడు. కాస్త విరామం దొర‌క‌గానే త‌న సోద‌రుడు అల్లు బాబీ నిర్మిస్తున్న `గ‌ని` సెట్‌కు వెళ్ళారు. వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా బాక్సింగ్ క్ల‌యిమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఫిలింసిటీ ఆవ‌ల‌వైపున వేసిన సెట్లో చిత్రీక‌ర‌ణ సాగుతుంది. మై బ్ర‌ద‌ర్ నిర్మాత‌గా మారాడు. అల్లు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఆహ్వానం ప‌లుకుతూ నేను ఈరోజు సెట్‌కు వెళ్ళానంటూ అల్లు అర్జున్ త‌న సోద‌రుడితో వున్న ఫొటోను పెట్టి ట్వీట్ చేశాడు.
 
Gani set Allu arjun
కాగా, గ‌ని చిత్రం షూటింగ్ ముగింపుకు ద‌శ‌కు చేరుకుంది. ప‌తాక‌స‌న్నివేశానికి హాలీవుడ్‌కు చెందిన బాక్స‌ర్‌ల‌ను తీసుకువ‌చ్చి చిత్రీక‌రిస్తున్నారు. విశేషం ఏమంటే, అల్లు అర్జున్ కూర్చుని బాక్సింగ్ చూస్తూన్న సీన్‌ను ప్ర‌మోష‌న్‌లో వాడుకోనున్న‌ట్లు తెలుస్తోంది. లేదా క‌థ‌కు స‌రిపోతే ఏకంగా సినిమాలోనే వుంచేలా నిర్మాత‌ ప్లాన్ చేస్తున్నాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.