శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (10:05 IST)

విజయ్ దేవరకొండతో విబేధాలు.. అనసూయ ఏమందంటే?

Anasuya
ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య విబేధాలు వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలపై అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం తెలిసిందే. వీటిపై ప్రస్తుతం అనసూయ స్పందించింది. 
 
విజయ్, తాను స్నేహితులమే. ఏ సమస్యా లేదు. కానీ అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత సీన్ మారింది. ఈ సినిమాలో పలికే బూతు పదాలను యువత ఎక్కువ వాడారు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఆ పదాలను పలకడం వింటుంటే బాధేసింది. అందుకే విజయ్‌తో మాట్లాడానని అనసూయ స్పష్టం చేసింది. అలాంటివి ప్రోత్సహించవద్దని విజయ్‌ని కోరానని అనసూయ వెల్లడించింది. ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ పేర్కొంది. 
 
ప్రచారకర్త తనను దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్లు అతడి బృందానికి చెందిన ఒకరు తనకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను కచ్చితంగా చెప్పగలను అంటూ అనసూయ వెల్లడించింది. ఇందుకు విజయ్ బాధ్యత వహించాల్సి వుంటుందనే విధంగా అనసూయ కామెంట్స్ చేసింది.