అమీర్ ఖాన్ లగాన్ టీమ్‌తో మరో ప్రయోగం
అమీర్‌ఖాన్ నటించిన సినిమా `లగాన్`. 2001లో ఆయనే నిర్మించి విడుదల చేశారు. అందరూ చిన్న చిన్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కించారు. అశుతోష్ గోవారికర్ రచన, దర్శకత్వం వహించారు. బ్రిటీష్ పాలకులు గ్రామాలకు పన్నులు వేసి ఏవిధంగా పీడించారో తెలియజెప్పే కథాంశం. ఇది అప్పట్లో ఇండియాలో ప్రతి గ్రామంలోని పరిస్థితి అలాంటిది. వారికి ఎదురుతిరిగి మాట్లాడితే శిక్ష కఠినంగా వుంటుంది. అలాంటిది ఓ మారుమూల గ్రామంలో వుండే అమీర్‌ఖాన్ తన ఊరి జనంతో కలిసి తెల్లదొరల క్రీడ క్రికెట్‌ను ఆడి ఏవిధంగా తమను తాము రక్షించుకున్నారనేది ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.
ఆ సినిమాలో గ్రేసీసింగ్, బ్రిటిష్ నటులు రాచెల్ షెల్లీ, పాల్ బ్లాక్‌తోర్న్ నటించారు. కానీ లగాన్ విడుదలై 20 ఏళ్ళు అయిన సందర్భంగా అమీర్‌ఖాన్ కు జూన్ 15న అభినందలు వెల్లువలా వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన తన భావాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మాయా ప్రపంచంలో నాతో ప్రయాణమైన ఎంతో మంది సీనియర్లకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా పంపిణీచేసిన వారికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఏమి చెప్పినా తక్కువే అంటూ వెలిబుచ్చారు.
అయితే ఈ సందర్భంగా లగాన్ టీమ్‌తోనే నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రయోగం చేయబోతున్నట్లు చిన్న వీడియోను విడుదల చేసంది. వర్షాలు పడక ఎండుబారిన గ్రామంలో ఓ మూగవాడు డప్పువాయిస్తూ అరుస్తుండగా అందరూ అక్కడికి చేరుకుంటారు. అతను ఆకాశం వైపు చూపిస్తాడు. కమ్ముకున్న మేఘాలు గ్రామం వైపు వస్తుంటాయి. ఇది ఆసక్తిగా అమీర్‌ఖాన్ బృందం చూస్తుండగా ఆకాశంలోనే `కమింగ్ సూన్. చలే చలోలగాన్. ఒన్స్ అపాన్ ఏ టైమ్ అండ్ ఇంపాజిబుల్ డ్రీమ్` అంటూ పేరు పడుతుంది. త్వరలో వివరాలు తెలియజేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.