సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (13:13 IST)

ఫ్యాట్ సర్జరీ వికటించి బుల్లితెర నటి చేతన రాజ్ మృతి

Chethan Raj
Chethan Raj
కన్నడ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర నటి చేతన రాజ్‌ సోమవారం రాత్రి మరణించింది. ఫ్యాట్ సర్జరీ చేయించుకుంటున్న సమయంలో వైద్యం వికటించి చేతన రాజ్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నటి చేతన రాజ్ మరణించినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 
 
సర్జరీ జరుగుతున్న సమయంలో నటి చేతన ఊపిరితిత్తుల్లో నీటి శాతం పెరగడం వల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. 
 
సమాచారాన్ని తెలుసుకున్న చేతన కుటుంబసభ్యులు హుటాహుటిని ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే మరోక ఆస్పత్రికి తరలించే లోగా నటి చేతన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 
 
కలర్స్ కన్నడ ఛానెల్‌లో గీత, దొరేసాని, లీనింగ్ స్టేషన్ సీరియల్స్‌లో చేతన రాజ్ నటించారు. 'హవాయి' సినిమాలోనూ నటి చేతన రాజ్ నటించారు.