మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జులై 2022 (12:53 IST)

పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన లేదు.. నిత్యామీనన్

nithya menon
దక్షిణాది సినీ ప్రియులకు ప్రముఖ మలయాళ నటి నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతుందని తెగ ప్రచారం జరుగుతోంది. 
తాజాగా ఆ వార్తలపై నిత్యమినన్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలు అన్నీ, తప్పుడు వార్తలు రాయొద్దని వేడుకున్నారు. అయినా, కూడా కొన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు మీద కథనాలు రాస్తూనే ఉన్నారు. 
 
దీంతో మరోసారి నిత్యమినన్ ఓ వీడియో రూపంలో తీవ్రంగా స్పందించారు. ఎవరో ఓ వ్యక్తి ఊహించి రాసిన ఆర్టికల్‌ను ఆధారంగా చేసుకొని, కొన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలు తెగ ప్రచారం చేస్తున్నాయి అని మండిపడ్డారు.
 
ఆ వీడియోలో నిత్యామినన్ మాట్లాడుతూ.."పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచన, ప్రణాళిక లేదు. ఎవరో ఓ వ్యక్తి ఊహించుకుని ఓ ఆర్టికల్‌ రాస్తే, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆ వార్తను అందరూ ప్రచారం చేస్తున్నారు. 
 
రోబోలా మెకానికల్‌గా ఉండటం నాకు ఇష్టం ఉండదు. అందుకే, అప్పుడప్పుడు సినిమాలకు బ్రేక్‌ ఇస్తుంటాను. నేను నటించిన ఐదారు సినిమాలు త్వరలోనే విడుదలకాబోతున్నాయి. ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాను" అని అన్నారు.