1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:34 IST)

నా జీవితం నాదే అంటున్న సిమ్రన్‌

Simran latest
Simran latest
నటి సిమ్రన్‌ చాలా కాలం గేప్‌ తీసుకుని మరలా సినిమాల్లో రావడానికి సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంది. ఉదయమే రైజింగ్‌ సూర్యుడిని చూస్తూ రోజూ చిరునవ్వుతో వుంటే పాజిటివ్‌ వైబ్స్‌ మనకు వస్తాయంటూ కొటేషన్‌ పెట్టింది. ఇటీవలే ఇన్‌స్ట్రాలో ఆమె తన అభిప్రాయాలను అభిమానులతో ముచ్చటించారు. గతంలో ఐటం సాంగ్స్‌ చేయడం గురించి కొంతమంది అడిగారు. అన్నయ్య సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేశాను. 
 
అదే టైంలో విజయ్‌తో తమిళ సినిమాలోనూ చేశాను. అప్పుడు విమర్శలు కొందరు చేశారు. కానీ ఆ సినిమాలకు వచ్చిన మైలైజ్‌ అంతా ఇంతాకాదు. ఇది తన జీవితం, నిర్ణయాలు తనవేనని పేర్కొంది. ఆమె మాటలు ఆసక్తికరంగా మారాయి. కొందరైతే మేడమ్‌. మీ అభిమానులం. తిరిగి నటిగా మరలా ఎంట్రీ ఇవ్వండి అని సూచిస్తున్నారు. మరి ఆ సూచనను పాటిస్తుందా? లేదా? అనేది చూడాలి. ఇప్పటికే సీనియర్‌ నటీమణులు రకరకాల ప్రోగ్రామ్‌ల బాట పట్టారు. ఖుష్బూ వంటివారు టీవీల్లో సందడి చేస్తున్నారు.