ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (11:35 IST)

"ఠాగూర్"దర్శకుడు వివి వినాయక్‌కు మేజర్ సర్జరీ!!

vv vinayak
మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఠాగూర్" చిత్రానికి దర్శకత్వం వహించిన వివి వినాయక్‌కు మేజర్ సర్జరీ జరిగింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇపుడు హైదరాబాద్ నగరంలోని కామినేని ఆస్పత్రిలో కాలేయ శస్త్ర చికిత్స జరిగింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో అనేక సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వివి వినాయక్‌కు కాలేయానికి ఆపరేషన్ జరిగింది. ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుంత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. 
 
రాయదుర్గంలో కొన్నేళ్ళ క్రితం ఆయన ఒక భారీ బంగ్లాను కొనుగోలు నిర్మించుకున్నారు. ఇటీవలే దాన్ని విక్రయించి కోకాపేట్‌లో ఒక ఖరీదైన అపార్టుమెంట్‌లోని షిఫ్ట్ అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వినాయక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. 
 
వినాయక్ చివరిగా "ఛత్రపతి" సినిమాను ఆయన హిందీలోని రీమేక్ చేశారు. సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని గత యేడాది విడుదల చేశారు. అయితే, ఈ సినిమా పెద్దగా ఫ్లాగ్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్టును ప్రకటించలేదు.