వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు కనిపించాయి..
వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. దీంతో నిర్లక్ష్యం వహించిన డెలివరీ యాప్, హోటల్‌పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.55 వేల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. ఈ ఘటనపై రాతపూర్వకంగా క్షమాపణ చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా డెలివరీ యాప్ సంస్థ, హోటల్ నిర్వాహకుల్ని ఆదేశించింది.
ఇంకా 45 రోజుల్లో ఆ పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని.. లేదంటే 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. రూ.200వరకు ఉండే వెజ్ బిర్యానీ విషయంలో నిర్లక్ష్యంతో ఇప్పుడు మొత్తం రూ.55వేలు కట్టాల్సి వస్తోంది. వినియోగదారుల మతపరమైన విశ్వాసాలను, ఆహార అభిరుచులను, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని కమిషన్ అభిప్రాయపడింది.