ఇంట్లో పచ్చరంగును ఏ దిశలో వుంచాలి..?
ఇంట్లో పచ్చ రంగు వస్తువులను ఇంట్లో ఉంచడానికి తగిన దిశల గురించి తెలుసుకుందాం. ఆకుపచ్చ రంగు వస్తువులను ఏ దిశలో ఉంచాలంటే.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, పప్పులు, బట్టలు, ఆకుపచ్చ రంగుకు సంబంధించిన వస్తువులను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం మంచిది. దీనిని అగ్ని కోణం అని కూడా అంటారు.
అలాగే, ఇంట్లో పచ్చటి గడ్డితో కూడిన చిన్న తోటను కూడా ఈ దిశలలో ఏర్పాటు చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు ఈ దిశలో వుంచడం ద్వారా ఆ ఇంట శుభం జరుగుతుంది. అందువల్ల ఆకుపచ్చని వస్తువులను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం శ్రేయస్కరం.
తూర్పున పచ్చని వస్తువులను ఉంచడం ద్వారా, ఇంట మగ సంతానానికి కలిసివస్తుంది. వారికి విజయం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆ ఇంట పుట్టిన కుమార్తెలకు మంచి జరుగుతుంది. ఈ దిశలో ఆకుపచ్చను వుంచడం ద్వారా నిరంతరం ఆ ఇంటి వంశాభివృద్ధికి తోడవుతుంది. వారి జీవితాన్ని మెరుగుపరుస్తుంది.