గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:54 IST)

ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల పచ్చడి ఎలా చేయాలంటే? (video)

sesame Chutney Recipe
నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.  స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్ వున్నాయి. 
 
నువ్వులు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల నువ్వుల్లో క్యాన్సర్ నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బ్రెయిన్‌లో ట్యూమర్ గ్రోత్‌ను నివారిస్తాయి. దాంతో బ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి నువ్వులతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
నువ్వులు - 100 గ్రాములు 
మిరపకాయలు - మూడు 
చింతపండు - నిమ్మకాయంత 
వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు 
అల్లం - ఒక రెబ్బ
కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు 
కరివేపాకు - తగినంత 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నువ్వులను దోరగా వేపుకోవాలి. రెండు లేదా మూడు నిమిషాల తర్వాత దాన్ని ప్లేటులోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొబ్బరి తురుము, ఉప్పును చేర్చి మిక్సీలో రుబ్బుకోవాలి. 
 
ఇందులో నువ్వులను కూడా చేర్చి రుబ్బుకుంటే నువ్వుల పచ్చడి రెడీ అయినట్లే. ఈ పచ్చడికి పోపు పెట్టుకుని వేడి వేడి అన్నంలోకి లేదా పప్పు, మజ్జిగతో అన్నం తీసుకునేటప్పుడు నంజుకుంటే టేస్టు అదిరిపోద్ది.