శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (12:49 IST)

తాగుడుకు బై బై చెప్పే బీరకాయ...

మద్యానికి బానిసైన వారు బీరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఆ అలవాటు నుంచి తప్పుకోవచ్చు. బీరకాయలోని పోషకాలు తాగుడు అలవాటును మాన్పిస్తాయి. అదెలాగంటే.. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. బీరలోని మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెరవ్యాధినీ నియంత్రిస్తుంది. 
 
బీరకాయలోని విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. అల్సర్లు, కడుపులో మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. వీటిలో విటమిన్ సి కూడా ఉండి జలుబుకు దూరంగా వుంచుతుంది. బి విటమిన్‌లు మంచి మూడ్‌ను, యవ్వనాన్ని అందిస్తాయి. జింక్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 
 
ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకలను దృఢంగా వుంచుతాయి. ఇన్ని రకాల ప్రయోజనాల గల బీరకాయలను అన్ని సీజన్లలోనూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుంటారు. వీటితో రకరకాల వంటల్ని తయారుచేసుకుని వారానికి రెండు సార్లు తినొచ్చు.
 
బీరకాయల్లోని విటమిన్‌ బి6 ఎనీమియాను నివారిస్తుంది. బీరకాయల్లోని పెప్టయిడ్స్, ఆల్కలాయిడ్లూ రక్తంలోని చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు తోడ్పడతాయి. బీరకాయల్లో రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కామెర్ల నుంచి కోలుకునేవారికి బీరకాయ రసం బాగా పనిచేస్తుంది. బీరకాయ గింజలు కాలేయాన్ని పరిశుభ్రపరచడానికి దోహదపడుతాయి.
 
ఒక కప్పు తాజా బీరకాయ రసంలో కొద్దిగా స్వీట్‌నర్ కలుపుకుని రోజుకు రెండు సార్లుగా తాగుతుంటే కామెర్లు, కాలేయ వ్యాధుల నుంచి త్వరగా కోలుకునే అవకాశం వుంటుంది. ఉదరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్థాలను బీరకాయ శుభ్రం చేస్తుంది.