శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:41 IST)

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

Kuppintaku
Kuppintaku
కుప్పింటాకు, ఉసిరికాయ ముక్కలను రెండు గ్లాసుల నీటిలో మరిగించి.. ఉదయం పరగడుపున సేవించడం ద్వారా చర్మ సమస్యలు దూరమవుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. ఇంకు కుప్పింటాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి జలుబు, దగ్గు, చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
 
కుప్పింటాకులో అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చర్మంపై వాపును బాగా తగ్గించడంలో సహాయపడుతుంది. కుప్పింటాకును నూరి గాయాలపై రాస్తే ఉపశమనం లభిస్తుంది. వాపును తగ్గిస్తుంది. 
 
కుప్పింటాకులో నొప్పి నివారణ గుణాలు ఉన్నాయి. ఈ ఆకు పేస్టును గాయాలకు, చర్మ సమస్యలకు పూతలా వేస్తారు. కుప్పింటాకు కషాయం పేగులోని పురుగులను వదిలించుకోవడానికి ఉపయోగిస్తున్నారు.
 
కుప్పింటాకులో అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మ సంరక్షణకు ఉత్తమమైన పదార్థాలలో ఒకటి. మొటిమలు, తామర వంటి అనేక చర్మ సమస్యలకు చికిత్సకు ఇది ఉపయోగపడుతుంది. 
 
కుప్పింటాకు పొడిని ఫేస్ ప్యాక్‌లలో వివిధ చర్మ సమస్యలకు చికిత్స కోసం వాడుతారు. కుప్పింటాకు ఆకులను బియ్యం నీళ్లతో మెత్తగా నూరి చర్మ సమస్యలకు ప్యాక్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది.
 
కుప్పింటాకులో యాంటీ అల్సర్ లక్షణాలను కూడా ఉన్నాయి. కుప్పింటాకు కషాయం తీసుకోవడం ద్వారా అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. కుప్పింటాకు మధుమేహం ఉన్నవారికి మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
 
కుప్పింటాకు మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ స్టీఫెన్సీ అనే దోమకు చెందిన లార్వాలను, గుడ్లను చంపుతుందని తేలింది. ఈ ఆకు రసంతో దోమలను దూరంగా ఉంచే స్ప్రేని తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

కుప్పింటాకు కషాయం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి. ఇంకా యాంటీ ఏజింగ్ ప్రాడెక్టుగా దీన్ని ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.