ఓవెన్‌ను ఎలా వాడాలి..?
ఇప్పటికాలంలో ప్రతి ఇంట్లో ఓవెన్ ఉండే ఉంటుంది. అయితే కొందరి ఇంట్లో పేరుకు మాత్రమే ఓవెన్ ఉంటుంది. కానీ, దానిని ఎలా ఉపయోగించాలో తెలియదు. అలాంటి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి.
1. ఆన్ చేసిన 5 నిమిషాల తర్వాత ఓవెన్‌ను వాడాలి. స్విచ్ ఆపిన 2 నిమిషాల తర్వాత మాత్రమే ఓవన్‌లో చేయి పెట్టడం మంచిది. ఓవెన్‌లో పేర్చబడిన పదార్థాలు ఉడుకుతున్నాయా.. లేదా అని తెలుసుకోవడానికి మాటిమాటికి ఓవెన్ మూత తెరచి చూడకూడదు. ఓవెన్ పైభాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ పొర ద్వారా చూడాలి.
2. ఓవెన్‌ను నీటితో కడిగితే త్వరగా పాడవుతుంది. పొడి బట్టతో తుడుస్తుండాలి. ఓవెన్ ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్లీ వాడాల్సివస్తే ఓ 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి అప్పుడు వాడాలి.
3. ఓవెన్ ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. కావున త్రీఫేస్ ప్లగ్‌ను వాడటం మంచిది. ఓవెన్ వేడిగా వుంటే బలవంతంగా తెరవకూడదు. చల్లారిన తర్వాత దానికదే తెరుచుకుంటుంది.
4. మామూలు ఓవెన్‌ల కన్నా ఆటోమేటిక్ కంట్రో సిస్టం వున్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఉత్తమమైంది. ఓవెన్ ద్వారా బ్రెడ్డు, కేకులు, బిస్కెట్లు, నాన్‌రోటీ, బేక్‌డ్ వెజిటబుల్స్ ఇతర వంటకాలను తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు.