శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2022 (22:50 IST)

కొన్నిరోజులు ఋతుక్రమాన్ని వాయిదా వేయాలి, ఎలా?

periods
కొన్ని కారణాల వల్ల స్త్రీలు తమ ఋతుక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలని అనుకుంటారు. పీరియడ్స్ కాస్త బ్రేక్ వేయాలంటే సహజసిద్ధమైన పద్ధతుల్లో వెళ్తే మంచిది. అవేంటో చూద్దాము.

 
స్పైసీ ఫుడ్- మిరపకాయ, నల్ల మిరియాలు, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరం పెట్టాలి. స్పైసీ ఫుడ్ తింటే రక్త ప్రసరణ పెరిగి ఋతుస్రావం అవకాశాలను పెంచుతుంది.

 
ఆవాలు- ఒక కప్పు గోరువెచ్చని పాలలో రెండు టీస్పూన్ల ఆవాల పొడిని కలిపి రుతుక్రమం వచ్చేముందు వారంలో ఒకసారి మాత్రమే త్రాగాలి.

 
వెనిగర్ - ఒక గ్లాసు నీటిలో 3 నుండి 4 టీస్పూన్ల వెనిగర్ వేసి, రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఋతుస్రావం ఆలస్యం అవుతుంది.

 
నిమ్మకాయ - దీనిని తీసుకోవడం వల్ల మీకు పీరియడ్స్ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.

 
రైస్ వాటర్- నిమ్మరసం కలిపిన రైస్ వాటర్ తాగవచ్చు. ఈ నీటిని రోజుకు 3 సార్లు త్రాగాలి

 
పుదీనా- దోసకాయ రసంలో పుదీనా కలిపి తాగవచ్చు. దీంతో రుతుక్రమం ఆలస్యం అవుతుంది.

 
వ్యాయామం- రుతుక్రమం సక్రమంగా జరగేందుకు వ్యాయామం చేస్తారు. కనుక వ్యాయామానికి కాస్త విరామం ఇస్తే రుతుక్రమం ఆలస్యం కావచ్చు.

 
పైన పేర్కొన్న చిట్కాలు ఒక సూచనగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స, ఔషధం, ఆహారం తీసుకునే ముందు దయచేసి వైద్యుడిని సంప్రదించండి