గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (09:07 IST)

పువ్వులతో చర్మ సౌందర్యం.. మల్లెపూల ముద్దకు చెంచా పాలు చేర్చి?

మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. పువ్వులు ముఖ చర్మానికి అందాన్ని, చర్మానికి తాజాదనాన్ని తెస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మానికి త

మల్లె, గులాబీ పువ్వుల వాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. పువ్వులు ముఖ చర్మానికి అందాన్ని, చర్మానికి తాజాదనాన్ని తెస్తాయి. సూర్యకిరణాలతో నల్లగా మారే చర్మానికి తిరిగి మెరుపును తేగలిగే ఔషధగుణాలు పువ్వుల్లో పుష్కలంగా వున్నాయి. ముఖ్యంగా మల్లెల్లో పొడిబారిన చర్మాన్ని మార్చగలిగే శక్తి ఉంది. చెంచా మల్లెపూల ముద్దకు చెంచా పచ్చిపాలను కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత చన్నీళ్లతో కడిగేయాలి. తద్వారా చర్మం మెరుపులీనుతుంది.
 
అలాగే గులాబీ రేకులు గుప్పెడు తీసుకుని రెండు చెంచాల నీటిని కలిపి ముద్దలా నూరాలి. దీనికి చెంచా చొప్పున పాలూ, గ్లిజరిన్‌ కలిపి ముఖం, మెడకూ రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే.. చర్మం మెరిసిపోతుంది. 
 
అలాగే కేశ, చర్మ సౌందర్యానికి మందారం ఎంతగానో తోడ్పడుతుంది. మందారం చర్మ కాంతిని పెంచుతుంది. ఇవి చర్మంపై ముడతలు లేకుండా నివారిస్తాయి. రెండు మందార పూల రేకులకు ఎనిమిది గులాబీ రేకులను కలిపి ముద్దలా చేసుకుని.. చెంచా పెరుగు, ముల్తానీ మట్టిని కూడా అందులో కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత కడిగేసుకోవాలి. తద్వారా చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయి.