సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2017 (10:12 IST)

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా? కీళ్ల నొప్పులకు ఇలా చేయండి..

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీ

ఆఫీసుల్లో గంటల కొద్దీ కూర్చుంటున్నారా..? కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే వీటి నుంచి సత్వర ఉపశమనం పొందాలంటే? మెగ్నీషియం అధికంగా గల ఆహారాన్ని  తీసుకోవాలి. పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు, జీడిపప్పు, నువ్వులు తదితరాల్లో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది. అలసటగా ఉన్నప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటే తీసుకుంటే ప్రయోజనం వుంటుంది. 
 
ప్రయాణంలో అలసినట్లైతే.. ఓ బకెట్ వేడి నీళ్లలో స్నానం చేయడం మంచిది. ప్రయాణాల తరువాత వెంటనే దైనందిన పనుల్లో నిమగ్నమయ్యే వారు ఎప్సంసాల్ట్ కలిపిన నీళ్లతో స్నానం చేస్తే మంచిది. ఇక అన్నిటికింటే సులువైన మరో పద్ధతి కోల్డ్ థెరపీ చేయాలి. ఓ టవల్ లేదా మెత్తని గుడ్డలో కొన్ని ఐస్ ముక్కల్ని వేసి నొప్పి వున్నచోట సున్నితంగా రాయాలి. ఐస్ నుంచి అందే చల్లదనంతో రక్తప్రసరణ వేగం పెరిగి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.