గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi

అలోవెరా జెల్‌తో పగుళ్లు మాయం

పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వ

పాదాల పగుళ్లను దూరం చేసుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి. గ్లిజరిన్, రోజ్ వాటర్‌తో కలిపి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు.. అలా 15 రోజుల పాటు రాస్తే ఫలితం వుంటుంది. పగుళ్లు మాయమవుతాయి. కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ రూపునిస్తుంది. మైనం ఆవనూనెతో కలిపి రాత్రి పూట పగుళ్లపై రాస్తే మంచి ఫలితం వుంటుంది. నువ్వుల నూనె కూడా ఈ సమస్య నివారణకు పనిచేస్తుందట. నిద్రించే ముందు పాదాలకు మర్ధన చేయాలి.
 
అరటి పండు గుజ్జు కూడా పగుళ్లపై మంచి ఔషధంగా పనిచేస్తుంది. పగుళ్లు తొందరగా మానిపోయేలా చేస్తుంది. పసుపు, తులసి, కర్పూరం సమాన మొత్తాల్లో తీసుకుని వీటికి అలోవెరా జెల్ కలిపి రాసి చూస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. 
 
కొబ్బరి నూనెను దాదాపు అన్ని సమస్యలు నుండి ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు. దీనిని పగిలిన పాదాలకు చికిత్స కోసం కూడా ఉపయోగించవచ్చు.  పాదాలపై నేరుగా కొబ్బరి నూనెను రాసుకుని, ఆపై సాక్స్ ధరించాలి. కొబ్బరి నూనె సహజ మాయిశ్చరైజర్ వలె పని చేసి, పగుళ్లు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా, కొబ్బరి నూనె పాదాలపై మాత్రమే కాకుండా, లోపల పొరల్లోకి కూడా ప్రవేశించి, పాదాలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.