శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (11:09 IST)

నిమ్మరసంలో చక్కెర కలిపి ఇలా చేస్తే..?

నిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదేవిధంగా అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. నిమ్మకాయతో ఫేస్‌మాస్క్, స్క్రబ్‌ను ఇంటివద్దనే తయారుచేసుకోచ్చు. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. తరచు నిమ్మతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అరకప్పు కొబ్బరి నూనెలో స్పూన్ చక్కెర, స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మెరిసిపోతుంది. పొడిచర్మం ఉన్నవారు ఈ స్క్రబ్ వాడితే ఫలితం ఉంటుంది. 
 
నిమ్మ జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా తేనె, వంటసోడా కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉండాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే జిడ్డు చర్మం పోతుంది.
 
నిమ్మకాయలోని విటమిన్ సి చర్మం నిగారింపును మెరుగుపరుస్తుంది. చర్మం మీద మృతుకణాలను తొలగిస్తుంది. పావుకప్పు నిమ్మరసంలో 2 స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకుని 20 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆపై ముఖాన్ని 2 నిమిషాల పాటు మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు పోతాయి.