మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (16:58 IST)

నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో అప్రెంటిస్ ఉద్యోగాలు

railway job
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కేంద్రంగా ఉన్న నార్త్ వెస్ట్రర్న్ రైల్వే నియామక బోర్డు కొత్తగా 2026 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్ డబ్ల్యూ ఆర్ వర్క్ షాప్ లేదా యూనిట్ల పరిధిలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 
 
ఈ నియామక ప్రక్రియలో భాగంగా, డివిజన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలను పరిశీలిస్తే, డివిజనల్ రైల్వే మేనేజరు కార్యాలయం, అజ్మీర్ పరిధిలో 413, బికనీర్‌లో 423, జైపూర్ డివిజన్‌లో 494, జోధ్‌పూర్ పరిధిలో 404, బీటీసీ క్యారేజ్ అజ్మీర్‌లో 126, బీటీసీ లోకో అజ్మీర్‌లో 65, క్యారేజ్ వర్క్ షాపులో బికనీర్‌లో 31, క్యారేజ్ వర్క్ షాపు, జోధ్‌పూర్‌లో 70 చొప్పున మొత్తం 2026 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఇందులో ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్ తదితర పోస్టులు ఉన్నాయి. 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో పాసై ఉండాలి. మెట్రిక్యులేషన్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. 
 
దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. వీటిని పంపించేందుకు చివరి తేదీ వచ్చే నెల 10గా నిర్ణయించారు.