బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 16 జూన్ 2022 (18:45 IST)

ఇంటర్ పాసైతే చాలు, ఏపీ నుంచి 1500 మంది ఫ్రెషర్స్‌ కోసం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వాక్‌-ఇన్‌ డ్రైవ్‌

image
విజయవాడలో జూన్ 25, 2022న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహించనున్నది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ (హెచ్‌సీఎల్‌) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న నగరాలలో వాక్‌-ఇన్‌ డ్రైవ్‌ను తమ ప్రతిష్టాత్మకమైన ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ టెక్‌ బీ కోసం జూన్‌ 2022 ప్రారంభం నాటి నుంచి నిర్వహిస్తోంది. ఈ తరహా డ్రైవ్స్‌ను పన్నెండవ తరగతి విద్యార్థులకు ఆర్థిక స్వేచ్ఛను అందించే అవకాశాలను సృష్టించడం కోసం నిర్వహిస్తున్నారు.

 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తమ విస్తరణను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1500 మంది ప్రతిభావంతులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రామ్‌ టెక్‌ బీ, వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ ఉన్నత విద్య కార్యక్రమం. భారత ప్రభుత్వ స్కిల్‌ ఇండియా మిషన్‌కు తోడ్పాటునందిస్తుంది. హెచ్‌సీఎల్‌ నూతన పీపుల్‌ స్ట్రాటజీలోభాగంగా, ఈ కార్యక్రమం ఐటీ ఇంజినీరింగ్‌ ఉద్యోగాలను ఎంపికైన 10+2 విద్యార్థులకు భవిష్యత్‌కు సిద్ధమైన నైపుణ్యాలతో అందిస్తుంది.

 
హెచ్‌సీఎల్‌ టెక్‌బీ కార్యక్రమం విద్యార్ధులను సాంకేతికంగా, ప్రొఫెషనల్‌గా హెచ్‌సీఎల్‌లో ప్రవేశ దశ ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తుంది. అక్కడ అభ్యర్థులకు 12 నెలల పాటు శిక్షణ అందిస్తారు. విద్యార్థులకు హెచ్‌సీఎల్‌ ప్రాజెక్ట్‌లలో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కూడా లభిస్తుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వద్ద పనిచేస్తూనే బిట్స్‌ పిలానీ, శాస్త్ర యూనివర్శిటీ, అమిటీ యూనివర్శిటీ లాంటి ప్రతిష్టాత్మక భాగస్వామ్య యూనివర్శిటీల నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ కూడా పూర్తి చేయవచ్చు.

 
ఒక సంవత్సరం పాటు జరిగే టెక్‌బీ శిక్షణా కార్యక్రమం పూర్తయిన తరువాత వారు సంవత్సరానికి 1.70- 2.20 లక్షల రూపాయల జీతం అందుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఎంపికైన విద్యార్థులు ఖచ్చితంగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వద్ద ఉద్యోగాన్ని శిక్షణా కార్యక్రమం పూర్తయిన తరువాత పొందుతారు. ఈ శిక్షణా కార్యక్రమం క్లాస్‌రూమ్‌ ట్రైనింగ్‌, ఇంటర్న్‌షిప్‌ల సమ్మేళనంగా ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్‌ సమయంలో 10 వేల రూపాయల స్టైఫండ్‌ అందిస్తారు.

 
2021లో మ్యాథమెటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమెటిక్స్‌‌తో 12వ తరగతి పూర్తి చేసినా లేదా 2022లో 12వ తరగతికి హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన విద్యార్థులు 60% లేదా అంతకు మించిన మార్కులతో 12వ తరగతి పూర్తి చేయడం ద్వారా ఈ ప్రోగ్రామ్‌ కొనసాగించవచ్చు.

 
అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ కెరీర్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌ (హెచ్‌సీఎల్‌ క్యాట్‌)కోసం హాజరవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే  ఈ పరీక్ష లో ప్రతిభ కనబరుస్తారో వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఆ తరువాత హెచ్‌సీఎల్‌, వారికి ఆఫర్‌/ఇంటెంట్‌ లెటర్‌ అందిస్తుంది. హెచ్‌సీఎల్‌ క్యాట్‌ అనేది ఆన్‌లైన్‌ ఎస్సెస్‌మెంట్‌ టెస్ట్‌. క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ (మ్యాథ్స్‌), లాజికల్‌ రీజనింగ్‌, ఇంగ్లీష్‌ భాషలలో ఈ పరీక్ష  ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమం కోసం ఫీజు ఒక లక్ష రూపాయలు+ పన్నులు.  ఈ ట్యూషన్‌ ఫీజు కోసం  ఋణాలను భాగస్వామ్య ఆర్ధిక సంస్థల ద్వారా సులభంగా చెల్లించతగిన నెలవారీ వాయిదా పద్ధతిలో అందిస్తారు. 

 
ఈ సందర్భంగా శ్రీ సుబ్బరామన్‌ బి, వైస్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాట్లాడుతూ, ‘‘టెక్‌ బీని 2017లో అత్యుత్తమ ప్రతిభావంతులను ఉద్యోగంలో తీసుకునేందుకు ప్రారంభించాము. దీనిద్వారా వారి కెరీర్‌ ప్రారంభంలోనే ఆర్థిక స్వేచ్ఛను అనుభవించే అవకాశం అందిస్తున్నాము. ఇప్పటివరకూ, 7వేల మందికి పైగా విద్యార్థులు టెక్‌ బీ కార్యక్రమం కోసం ఎంపికయ్యారు. వారు హెచ్‌సీఎల్‌లో తమ కెరీర్‌ పరంగా వివిధ దశలలో ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధుల నుంచి అమితాసక్తి ఈ కార్యక్రమానికి ఉన్నట్లుగా మేము గమనించాము. ఈ కారణం చేతనే ఈ రాష్ట్రంలో వాక్‌-ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాము’’ అని అన్నారు.