శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (20:04 IST)

కరోనా వైరస్ సెకండ్ వేవ్ రాబోతోంది.. అలెర్ట్‌ అవసరం: సీఎం జగన్

కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌కు కూడా చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోవిడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మరో లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోందని జగన్ అన్నారు. అనేక దేశాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందని చెప్పారు. అక్కడ ప్రారంభమైన వెంటనే మన దేశంలో కూడా అదే జరుగుతోందని చెప్పారు. అందువల్ల మనకు కూడా సెకండ్ వేవ్ రాబోతోందని చెప్పారు. 
 
స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 25న డీ-ఫామ్ ఇస్తూ ఇంటి స్థలం పట్టాలను ఇస్తామని జగన్ వెల్లడించారు. టీడీపీ హయాంలో పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలను కట్టబెట్టారని... ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్థలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దేవుడు మనకు అండగా ఉన్నాడని... ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని అన్నారు. 
 
కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. ప్రతిపక్షం కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని.. అందువల్లే ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని చెప్పారు.