గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (23:23 IST)

తెలంగాణ కొత్తగా 2,175 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 2,175  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం సాయంత్రం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,346కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 3,821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,918 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 253 కేసులు నమోదయ్యాయి.