గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (09:13 IST)

విశాఖ గడ్డపై ధోనీ సరికొత్త రికార్డు : టీ20 క్రికెట్‌లో ఆ ఘతన అతనిదే...

Dhoni
మహేంద్ర సింగ్ ధోనీ మరో ఘనత సాధించారు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపిన వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించారు. వికెట్ల వెనుక ఇప్పటివరకు 300 మందిని ధోనీ ఔట్ చేశాడు. అలాగే, అత్యధిక సిక్సర్ల బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. 
 
ఐపీఎల్ 2024 సీజన్‌ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. పృథ్వీషా క్యాచ్ అందుకున్న ధోనీ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా 300 మంది ఆటగాళ్ళను ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కీపర్ దినేశ్ కార్తీక్, లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ వంటి వారిని వెనక్కి నెట్టేశాడు. టీ20 క్రికెట్‌లో వికెట్ల వెనుక ధోనీ ఇప్పటివరకు 300 మందిని ఔట్ చేయగా, అందులో 213 క్యాచ్‌లు ఉండటం గమనార్హం. 
 
ధోనీ తర్వాత స్థానంలో దినేశ్ కార్తీ 276 (207 క్యాచ్‌లు), కమ్రాన్ అక్మల్ 274 (172 క్యాచ్‌లు), క్వింటన్ డీకాక్ 269 (220 క్యాచ్‌లు), జోస్ బట్లర్ 208 ( 167 క్యాచ్‌లు)లు టాప్-5 ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇక 42 యేళ్ల ధోనీ గత ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ బ్యాట్ ఝుళిపించాడు. జట్టు విజయానికి 23 బంతుల్లో 72 పరుగులు అవసరమైన 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరిపోయాడు. 
 
కాగా, ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
క్రిస్ గేల్ 141 ఇన్నింగ్స్‌లలో 357 సిక్సర్లు 
రోహిత్ శర్మ 240 ఇన్నింగ్స్‌లలో 261 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ 170 ఇన్నింగ్స్‌లలో 251 సిక్సర్లు
ఎంఎస్ ధోనీ 219 ఇన్నింగ్స్‌లలో 242 సిక్సర్లు
విరాట్ కోహ్లీ 232 ఇన్నింగ్స్‌లలో 241 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ 179 ఇన్నింగ్స్‌లలో 234 సిక్సర్లు