బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (11:47 IST)

లాక్‌డౌన్ ఎఫెక్టు.. మారిపోతున్న మనుషుల స్టైల్ : కపిల్ న్యూ లుక్ ఇదే...

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా బార్బర్ షాపులు కూడా మాతపడ్డాయి. దీంతో అనేక మంది మాసిన గెడ్డం, పెరిగిన జుత్తుతో దర్శనమిస్తున్నారు. మరికొందరు సెలెబ్రిటీలు అయితే, తమ వెంట్రుకలు వారే కత్తిరించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. 
 
ఇలాచేయడం వల్ల ఏకంగా వారి రూపాలే మారిపోతున్నాయి. ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలు వివిధ రకాలైన హెయిర్ కట్టింగ్‌లతో సరికొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా హర్యానా హరికేన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కూడా సరికొత్త హెయిర్ స్టైయిల్‌ను రూపొందించుకున్నారు. 
 
గుండు - ఫ్రెంచ్ గెడ్డంతో ఇపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. పైగా, గుండు, ఫ్రెంచ్ గెడ్డంలో కపిల్ దేవ్ నల్లటి సూట్, నల్లటి సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ఎంతో చూడముచ్చటగా కూడా ఉంది. అలాగే, మరో లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే తరహాలో తెల్లటి ఫ్రెంచ్ గెడ్డంలో మెరిసిపోతున్న విషయం తెల్సిందే.