లివర్ డ్యామేజ్ కాకుండా వుండాలంటే ఏం చేయాలి?  
                                       
                  
                  				  చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయం దెబ్బతినడానికి ఇంకా ఏమేమి కారణాలున్నాయో తెలుసుకుందాము. నాణ్యత లేని నూనెతో వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
	 
				  											
																													
									  
	మద్యం సేవించడం కూడా లివర్ అనారోగ్యానికి కారణమవుతుంది కనుక మద్యాన్ని మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది కనుక పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి. రాత్రి పూట త్వరగా పడుకొని, ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.
	 
				  
	ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు, ఇలా చేస్తే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్ పైన ఎక్కువ భారం పడుతుంది.