గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 మే 2018 (12:51 IST)

సిమ్ కావాలంటే ఆధార్ ఇవ్వనక్కర్లేదు... కేంద్రం

సిమ్ కావాలంటే ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని టెలికాం శాఖలకు ఆదేశాలు పంపించింది.

సిమ్ కావాలంటే ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని టెలికాం శాఖలకు ఆదేశాలు పంపించింది. 
 
గతంలో ఉన్నట్లే ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్ పోర్టు ఇలా వివిధ గుర్తింపు కార్డులకు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వినియోగదారుల నుంచి వస్తున్న వ్యతిరేకత, విమర్శలు, ఆధార్ డేటా లీకేజ్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్రం.. ఈ విధంగా నిర్ణయం తీసుకుంది.
 
ఈ మేరకు టెలికాం కంపెనీలు అన్నీ వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందరరాజన్ కోరారు. ఇక నుంచి ఆధార్ నెంబర్ లేదని సిమ్ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించొద్దని కూడా ఆదేశించారు. 
 
మొబైల్ సిమ్ కార్డ్ కావాలంటే ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాలన్న నిబంధనలు ఏమీ లేదని.. ఇస్తే తీసుకోవచ్చని సూచించారు. అంతేకానీ, ఆధార్ నంబర్ ఇవ్వాలని బలవంతం చేయకూడదని టెలికాం కంపెనీలను ఆదేశించారు. సరైన ధృవీకరణ పత్రాలు ఇస్తే సిమ్ కార్డు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది.