మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 బడ్జెట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్‌సంగ్ కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13ను లాంచ్ చేసింది. గత సంవత్సరం రిలీజై పాపులర్ అయిన గెలాక్సీ ఎం12కు ఇది సక్సెసర్‌గా వచ్చింది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేతో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 వస్తోంది.
అలాగే వెనుక మూడు కెెమెరాలు ఉండగా.. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 ఓఎస్‌తో శామ్‌లసంగ్ శామ్‌సంగ్ గాలెక్సీ ఎం 13 వస్తోంది.
6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంది.
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో ఉంటుంది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను సామ్‌సంగ్ ఇస్తోంది. 4జీ, ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ 4జీతో వస్తుండగా.. 5జీ మోడల్‌ను కూడా లాంచ్ చేయాలని సామ్‌సంగ్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.